cooked food: వండిన ఆహారం ఎన్ని రోజుల పాటు ఫ్రిజ్ లో నిల్వ ఉంటుంది?

For how long should you store cooked food in the fridge
  • గాలి చొరబడని కంటెయినర్ లో ఉంచి రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి
  • అలా చేస్తే వారం వరకు తాజాగా ఉంటాయి 
  • డీఫ్ ఫ్రీజర్ లో పెడితే ఆరు నెలల వరకు పాడవవు
వండిన ఆహారాన్ని వేడి తగ్గక ముందే తినేయడం ఆరోగ్యప్రదం. ఈ సూచనను మన పూర్వీకుల నుంచి వినిపిస్తూనే ఉంటుంది. కానీ, నేటి జీవనం అంతా ఉరుకుల పరుగుల మయం. తీరిక ఉన్నా.. వంటకు బదులు ఇతర వ్యాపకాలకు ఆ సమయాన్ని ఖర్చు చేస్తున్నాం. అందుకే ఒకేసారి ఎక్కువ పరిమాణంలో వండి దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టి తినే వారు కూడా ఉన్నారు. ఇలా చేయవచ్చా? అసలు రిఫ్రిజిరేటర్ లో వండిన ఆహారం ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది? పాడైపోదా? ఇలా ఎన్నో సందేహాలు వస్తుంటాయి. 

నిపుణులు సైతం వండిన ఆహారాన్ని ఎక్కువ సమయం పాటు ఫ్రిజ్ లో పెట్టేసి వాడుకోవద్దని సలహా ఇస్తుంటారు. ఇదే విషయమై రచయిత, టీసీఎస్ డిజిటల్ వర్క్ ప్లేసెస్ గ్లోబల్ హెడ్ అయిన క్రిష్ అశోక్ కాస్త అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వండిన ఆహారాన్ని ఎంత సమయం పాటు ఫ్రిజ్ లో ఉంచొచ్చు? అలా ఉంచడం వల్ల చల్లదనానికి పోషకాలు నశించిపోతాయా? వీటికి ఆయన స్పష్టత నిచ్చారు. ఇందుకు సంబంధించి వీడియోను ఇన్ స్టా గ్రామ్ ఖాతా (_masalalab)లో పోస్ట్ చేశారు. 

‘‘రిఫ్రిజిరేటర్ లో ఆహారం ఉంచడం వల్ల పోషకాలు పోవడం ఉండదు. నిజానికి వండినప్పుడే ఎక్కువ పోషకాలను నష్టపోతుంటాం. నీటిలో కరిగిపోయే విటమిన్లు ఎప్పుడూ అస్థిరంగానే ఉంటాయి. కనుక వీటిని వండినప్పుడు అధిక వేడి కారణంగా ఎక్కువగా కోల్పోవడం జరుగుతుంది’’ అని వివరించారు.

‘‘గాలి ప్రవేశించని కంటెయినర్ (ఎయిర్ టైట్)లో ఆహారాన్ని ఉంచి రిఫ్రిజిరేటర్ లో పెట్టేస్తే కనీసం 2-3 రోజుల నుంచి వారం వరకు నిల్వ ఉంటుంది. డీప్ ఫ్రీజర్ లో పెట్టేస్తే, ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఉన్నట్టయితే ఆరు నెలల వరకు ఆహారం పాడవదు. కాకపోతే కొన్నింటికి మినహాయింపు ఉంది. సాధారణంగా ఉడికించిన లేదా స్టీమ్డ్ రైస్ తో చేసిన ఆహారం బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ కావచ్చు. కనుక దీన్ని ఒకటి రెండు రోజుల్లోనే తినేయాలి. భారతీయ ఆహారం రిఫ్రిజిరేటర్ కు అనుకూలంగా ఉంటుంది. స్పైసీగా, ఉప్పుతో ఉండడం వల్ల సూక్ష్మక్రిములు అంత తొందరగా చేరవు’’ అని ఆయన తెలిపారు.
cooked food
fridge
store
how long?
refregirator

More Telugu News