ఆర్ఆర్ఆర్, పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ఆసక్తికర ట్వీట్
- గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి చరణ్ తో కలిసి వెళ్లిన ఉపాసన
- ఆర్ఆర్ఆర్ ప్రయాణంలో భాగం అయినందుకు సంతోషంగా ఉందని ట్వీట్
- పుట్టబోయే బిడ్డకూ ఈ అనుభూతి దక్కిందన్న ఉపాసన
ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డు లభించడం, ఈ చారిత్రక సందర్భంలో కడుపులో బిడ్డ సహా తాను పాలు పంచుకోవడంపై ఆమె స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్ కుటుంబంలో నేనూ భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది దేశం గర్వించే విజయం. ఈ ప్రయాణంలో నన్ను భాగస్వామిని చేసిన రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ (పుట్టబోయే బిడ్డ) కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. చాలా ఉద్వేగంగా కూడా ఉంది’ అని ఉపాసన ట్వీట్ చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో చిత్ర బృందంతో దిగిన ఫొటోలను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు.