Abhiram: ఇప్పుడు నేను ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే: 'అహింస' ట్రైలర్ రిలీజ్!

Ahimsa Trailer Released
  • తేజ దర్శకత్వంలో రూపొందిన 'అహింస'
  • పల్లెటూరి స్వచ్ఛమైన ప్రేమకథా నేపథ్యం 
  • అభిరామ్ జోడీగా గీతిక పరిచయం 
  • రీ ఎంట్రీ ఇచ్చిన ఆర్పీ పట్నాయక్
  • త్వరలోనే థియేటర్లకు రానున్న సినిమా
అభిరామ్ దగ్గుబాటి హీరోగా 'అహింస' సినిమా రూపొందింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, తేజ దర్శకత్వం వహించాడు. ప్రేమకథల స్పెషలిస్టుగా తేజకి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఆయన నుంచి రానున్న ఈ సినిమా కోసం యూత్ అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఒక అందమైన పల్లెటూరి ప్రేమకథ. ఆ ప్రేమకథకు చుట్టూ చట్టం .. న్యాయం .. నక్సలిజం నిలబడతాయి. తమ వ్యతిరేక శక్తుల నుంచి ఆ ప్రేమికులు తమ ప్రేమను ఎలా కాపాడుకుంటారనేదే కథ. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. 

"కృష్ణుడే కరెక్ట్. ఇప్పుడు నేను నా కుటుంబాన్నీ .. నా పరివారాన్నీ .. నన్ను నమ్ముకున్నవాళ్లను కాపాడటమే నా ధర్మం. ఇప్పుడు నేను ధర్మం కోసం యుద్ధం చేయాలసిందే" అంటూ హీరో చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా అనిపిస్తోంది. 

ఈ సినిమాతోనే తెలుగు తెరకి అభిరామ్ హీరోగా పరిచయమవుతున్నాడు. హీరోయిన్ గీతికకి కూడా ఇదే ఫస్టు మూవీ. ఇక ఈ సినిమాతోనే ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రజత్ బేడీ .. సదా ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Abhiram
Geethika
Sada
Ahimsa Movie

More Telugu News