నీ పట్ల గర్విస్తున్నాం బావా... దర్శకుడు బాబీకి విషెస్ తెలిపిన ప్రముఖ చెస్ క్రీడాకారిణి
- చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య
- నిన్న విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. జనవరి 13న రిలీజ్
- నీ హార్డ్ వర్క్ మాకు తెలుసు బావా అంటూ ద్రోణవల్లి హారిక ట్వీట్
ఈ నేపథ్యంలో ద్రోణవల్లి హారిక స్పందించింది. "నీ పట్ల మేం చాలా చాలా గర్విస్తున్నాం బావా. నువ్వెంత శ్రమించావో మాకు తెలుసు... నీ తదుపరి విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆగలేకపోతున్నాం" అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాము టీవీలో చూస్తున్నప్పటి ఫొటోలను కూడా హారిక పంచుకుంది.