self balancing: దానంతట అదే బ్యాలన్స్ చేసుకునే స్కూటర్

Worlds first self balancing electric scooter set for Auto Expo 2023
  • అభివృద్ధి చేసిన ముంబై కంపెనీ లైగర్ మొబిలిటీ
  • సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీ మరో ప్రత్యేకత
  • నడిపే వారికి మరింత భద్రత, సౌకర్యం ఉంటాయంటున్న కంపెనీ
ద్విచక్ర వాహనం ఏదైనా కానీయండి.. దాన్ని నడిపే వారే బ్యాలన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, దానంతట అదే బ్యాలన్స్ చేసుకుంటే? అది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రపంచంలోనే అలాంటి తొలి సెల్ఫ్ బ్యాలెన్స్ డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ముంబైకి చెందిన లైగర్ మొబిలిటీ తీసుకువస్తోంది. అంతే కాదు, ఈ స్కూటర్ లో సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. త్వరలో జరిగే ఆటో ఎక్స్ పో 2023 (వాహనాల ఎగ్జిబిషన్)లో ఈ స్కూటర్ ను ప్రదర్శించనున్నారు. ఎప్పుడో 2019లో ఈ స్కూటర్ గురించి ప్రకటించగా, ఇప్పుడు తయారీకి సిద్ధమైంది. 

చూడ్డానికి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, వెస్పా మాదిరే ఇది కూడా ఉంటుంది. ఈ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెట్రో స్టయిల్ తో ఉంటుంది. విశాలమైన సీట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ ఫోర్క్ ఉంటాయి. అలాయ్ వీల్స్ తో, ముందు డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్ ఉంటాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన విప్లవాత్మక టెక్నాలజీని ఈ స్కూటర్ లో చూస్తారని తయారీ సంస్థ లైగర్ మొబిలిటీ అంటోంది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఫీచర్ వల్ల నడిపే వారికి భద్రత, మెరుగైన రైడింగ్ అనుభవం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
self balancing
electric scooter
liger mobility
mumbai
auto expo 2023

More Telugu News