Nadendla Manohar: ఉత్తరాంధ్ర, రాయలసీమ డెవలప్ మెంట్ బోర్డులను ఏర్పాటు చేయాలి: నాదెండ్ల మనోహర్

  • ఉత్తరాంధ్రను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న నాదెండ్ల  
  • మైనింగ్ మాఫియా పెరిగిపోయిందని మండిపాటు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్య
Nadendla Manohar demands to setup North Andhra development board

ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ గడ్డను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని... ఈ ప్రాంత అభివృద్ధి కేవలం శంకుస్థాపనలకే పరిమితం అయిందని చెప్పారు. ఈ ప్రాంతంలో మైనింగ్ మాఫియా పెరిగిపోయిందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని చెప్పారు. ఉత్తరాంధ్రలోని నిరుద్యోగులు కోచింగ్ ల కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ డెవలప్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం అరకు డిక్లరేషన్ చేస్తామని చెప్పారు.

More Telugu News