Rishabh Shetty: నేటితో 100 రోజులను పూర్తిచేసుకున్న 'కాంతార'

  • కన్నడలో సంచలనం సృష్టించిన 'కాంతార'
  • క్రితం ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన సినిమా
  • ఈ రోజుతో 100 రోజులు పూర్తి
  • అడవి నేపథ్యంలో నడిచే కథ  
  • భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా
Kantara Completed 100 Days

కన్నడ చలనచిత్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని 'కాంతార' సినిమా క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి - సప్తమి గౌడ జంటగా నటించిన ఈ సినిమాకి, అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చాడు. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమా, కన్నడలో క్రితం ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైంది. 

భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. చాలా తక్కువ సమయంలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ రోజుతో ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మేకర్స్ అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదిలారు. ఈ సినిమాలో హీరోతోపాటు  రచయిత .. దర్శకుడు కూడా రిషబ్ శెట్టినే కావడం విశేషం.  

కన్నడతో పాటు ఇతర భాషల్లోను విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల్లోను హిట్ టాక్ ను సొంతం చేసుకుంది .. లాభాలను తెచ్చిపెట్టింది. అడవిలోని ఒక గిరిజన గూడెం .. అక్కడివారితో పెనవేసుకుపోయిన దైవ సంబంధమైన విశ్వాసం .. ఆ విశ్వాసాన్ని లెక్కచేయకుండా స్వార్థానికి పోయిన ఒక దొరకి ఎలాంటి పరిస్థితి ఎదురైందనేదే కథ.

More Telugu News