స్వర్ణం కొల్లగొట్టిన తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్
- జాతీయ పురుషుల బాక్సింగ్ లో విజేతగా హుస్సామ్
- ఫైనల్లో 4–1తో రైల్వేస్ కు చెందిన సచిన్ పై గెలుపు
- గతేడాది రజతం సాధించిన హుస్సాముద్దీన్
పోటాపోటీగా జరిగిన తుది పోరులో అతను తొలి రౌండ్ నుంచే అద్భుత ప్రదర్శన చేశాడు. తన అనుభవాన్ని ఉపయోగించి బలమైన పంచ్ లు విసురుతూ ప్రత్యర్థి సచిన్ ను ఓడించాడు. భారత మరో స్టార్ బాక్సర్ అస్సాంకు చెందిన శివ థాపా కూడా బంగారు పతకం గెలిచాడు. 63.5 కిలోల విభాగంలో బరిలోకి దిగిన థాపా ఫైనల్లో 5–0తో అంకిత్ నర్వాల్ (రైల్వేస్)ను చిత్తు చేశాడు. ఈ టోర్నీలో హుస్సాముద్దీన్ ప్రాతినిథ్యం వహించిన సర్వీసెస్ జట్టు.. టీమ్ చాంపియన్ షిప్ సొంతం చేసుకుంది. ఆ జట్టుకు చెందిన బాక్సర్లు ఆరు స్వర్ణాలు సహా పది పతకాలు గెలిచారు.