ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం... భారత్ లోనూ ప్రకంపనలు
- హిందూకుష్ పర్వతశ్రేణిలో భూకంపం
- ఫైజాబాద్ కు 79 కిమీ దూరంలో భూకంప కేంద్రం
- రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదు
- భారత్, పాకిస్థాన్ లోనూ కంపించిన భూమి
దీని ప్రభావంతో భారత్, పాకిస్థాన్ దేశాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పాటు హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రాత్రి 7.50 గంటల సమయంలో ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది.
దేశ రాజధాని ప్రాంతంలో జనవరి 1 వేకువజామున కూడా భూకంపం వచ్చినట్టు ఎన్సీఎస్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది.