Nagashourya: నాగశౌర్య జోడీగా పరిచయమవుతున్న అందాల మందారం!

  • తెలుగు తెరపై కొత్త హీరోయిన్ల సందడి 
  • మోడలింగ్ వైపు నుంచి వచ్చిన మరో బ్యూటీ 
  • ఎస్.ఎల్.వి. బ్యానర్ తో టాలీవుడ్ కి పరిచయం 
  • ఈ రోజున బర్త్ డే జరుపుకుంటున్న బ్యూటీ 
  • శుభాకాంక్షలు అందజేసిన టీమ్
Yukthi Thareja Special

ఆ మధ్య నాగశౌర్య ఒక వైపున తన సొంత బ్యానర్లోను .. మరో వైపున బయట బ్యానర్లలోను వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ వెళ్లాడు. దాంతో ఏ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం సరిగ్గా రిజిస్టర్ కాలేదు. కొంతకాలంగా నాగశౌర్య నుంచి వచ్చిన ఏ సినిమా కూడా, ఆయన అభిమానులను ఉత్సాహపరచలేకపోయింది. 

ఈ నేపథ్యంలోనే ఆయన ఎస్.ఎల్.వి. బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు. క్రితం ఏడాది ఆగస్టులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 

ఈ సినిమాతో యుక్తి తరేజా కథానాయికగా పరిచయం కానుంది. తను హర్యానా బ్యూటీ .. మోడలింగ్ మీదుగా సినిమాల్లోకి వచ్చింది. ఈ రోజున ఆమె బర్త్ డే కావడంతో, ఎస్.ఎల్.వి. సినిమాస్ టీమ్ గ్రీటింగ్స్ తెలియజేసింది. అందానికి ఆనవాలుగా కనిపించే ఈ సుందరి చూపులతోనే కట్టిపడేస్తోంది. ఈ సినిమా తరువాత ఇక్కడి యంగ్ బ్యూటీస్ కి గట్టి పోటీ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News