Pawan Kalyan: జగన్ కు పవన్ కల్యాణ్ బహిరంగలేఖ

Pawan Kalyan open letter to Jagan
  • ర్యాలీలు, సభలపై నిషేధం విధించడంపై పవన్ మండిపాటు
  • మీరు దశాబ్దం పాటు ఓదార్పు యాత్రలు చేశారన్న పవన్
  • ప్రతిపక్షాలను జనాల్లో తిరగనివ్వకపోతే ఎలాగని ప్రశ్న
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ర్యాలీని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఓదార్పు యాత్ర పేరుతో మీరు దశాబ్ద కాలం పాటు యాత్రలు, రోడ్ షోలు చేయవచ్చు కానీ... ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలు జనాల్లో తిరగొద్దా? అని ప్రశ్నించారు. 

ప్రతిపక్షాలు జనాల్లో తిరగడానికి అనుమతించకపోతే ఎలాగని ప్రశ్నించారు. మీరు అధికారంలో లేనప్పుడు ఒక రూలు, అధికారంలోకి వచ్చాక మరో రూలా? అని ప్రశ్నించారు. మరోవైపు పింఛన్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ బహిరంగలేఖ రాశారు. మీ పింఛన్లను ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ 4 లక్షల మంది లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడం దారుణమని అన్నారు. 

Pawan Kalyan
Janasena
Jagan
YSRCP

More Telugu News