Bhanuprakash Reddy: తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేసేవారిని అడ్డుకుంటాం: బీజేపీ

  • రాజకీయ విమర్శలు చేసేందుకే కొందరు తిరుమలకు వస్తున్నారన్న భానుప్రకాశ్ రెడ్డి
  • తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం ఉందని వ్యాఖ్య
  • కొండపై రాజకీయాలు మాట్లాడేవారిని తిరుపతిలో అడ్డుకుంటామని హెచ్చరిక
Will oppose those who speaks politics on Tirumala says BJP

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రతిరోజూ వివిధ పార్టీలకు చెందిన ఎందరో నాయకులు దర్శించుకుంటున్నారు. అయితే, కొందరు నేతలు మాత్రం స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే, ఆలయం ముందే మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటం కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కొంతమంది నాయకులు కేవలం ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించేందుకే తిరుమలకు వస్తున్నారని అన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం ఉందని... అయినా కొందరు రాజకీయాలు మాట్లాడుతున్నా టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు చేసేవారి నుంచి శ్రీవారి కానుకను వసూలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై టీటీడీ స్పందించకుంటే రాజకీయ ప్రసంగాలు చేసేవారిని తిరుపతిలో బీజేపీ అడ్డుకుంటుందని హెచ్చరించారు.

More Telugu News