హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో 70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మహత్య
- ఎర్రగడ్డ స్టేషన్ పై నుంచి దూకిన వృద్ధురాలు
- వృద్ధురాలిది మహబూబాబాద్ జిల్లా మక్తల్ గా గుర్తింపు
- కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మారెమ్మ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఆమె హైదరాబాద్ కు ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటనే వివరాలను ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మారెమ్మ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సనత్ నగర్ పోలీసులు వివరించారు.