Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన.. శాంతిపురంలో భారీగా పోలీసుల మోహరింపు

hundreds of police staff in shanthipuram mandal due to chandra babu tour
  • ప్రచార రథంతో పాటు సౌండ్ సిస్టం వాహనం సీజ్
  • డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వాహనాలు స్టేషన్ కు తరలింపు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! తాజాగా నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో వందలాదిగా పోలీసులను మోహరించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులను అక్కడికి తరలించింది. టీడీపీ ప్రచార రథాన్ని, మరో వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు వాటిని స్టేషన్ కు తరలించారు. ఆ రెండు వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. సౌండ్ సిస్టం ఉపయోగించేందుకు అనుమతి కోరుతూ పోలీస్ అధికారులకు టీడీపీ నేతలు ఇప్పటికే లేఖ రాశారు. 

కుప్పం పర్యటనలో భాగంగా కేనుమాకురిపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ నేతలు తలపెట్టగా.. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజీని పోలీసులు తొలగించారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ లోని అన్ని గ్రామాల్లో భారీగా సిబ్బందిని మోహరించారు. గ్రామగ్రామాన, కూడళ్లు పోలీసు వాహనాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ పర్యటన కోసం చంద్రబాబు ఇంకాసేపట్లో పెద్దూరు గ్రామానికి చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Chandrababu
kuppam
shanthipuram mandal
police
tdp

More Telugu News