Poco C50: రూ.6,249కే పోకో నుంచి స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్ కార్ట్ లో లభ్యం

Poco C50 with 5000mAh battery launched in India price starts at Rs 6249
  • రెండు వేరియంట్లలో లభ్యం
  • రూ.6,499, రూ.7,299గా ధరలు నిర్ణయం
  • ఆరంభ ఆఫర్ల కింద కొంత తగ్గింపు
  • ఈ నెల 10 ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలు మొదలు
షావోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో.. అతి తక్కువ ధరకు ఓ మొబైల్ ఫోన్ ను ఆవిష్కరించింది. పోకో సీ50 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.6,499 నుంచి ప్రారంభం అవుతుంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ తో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 

2జీబీ వేరియంట్ ధర రూ.6,499. 3జీబీ వేరియంట్ ధర రూ.7,299. ఆరంభ ఆఫర్ కింద ఈ ఫోన్లను రూ.6,249, రూ.6,999కే అందిస్తోంది. 6.5 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. మీడియాటెక్ హీలియో ఏ22 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో వస్తుంది. ఇది బేసిక్ ఫోన్. గేమింగ్ కు, ప్రత్యేకమైన కెమెరా అవసరాలకు సరిపడదు. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ చార్జర్ తో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ నెల 10వ తేదీ నుంచి విక్రయాలు మొదలవుతాయి. రాయల్ బ్లూ, కంట్రీ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి.
Poco C50
launched
Indian market
smart phone
lowest price
Rs 6249

More Telugu News