'ధమాకా' .. ఈ రోజుతో 100 కోట్లు వచ్చేసినట్టే!
- రవితేజ తాజా చిత్రంగా వచ్చిన 'ధమాకా'
- మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్న సినిమా
- రవితేజ జోడీగా మెప్పించిన శ్రీలీల
- 11 రోజుల్లో 94 కోట్ల వసూళ్లు
తొలి రోజున 10 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వీకెండ్ తరువాత కూడా తన దూకుడును కొనసాగిస్తూ వెళుతోంది. నిన్నటితో ఈ సినిమా 11 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 11 రోజుల్లో ఈ సినిమా 94 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ రోజుతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అటు క్లాస్ లుక్ లోను .. ఇటు మాస్ లుక్ లోను రవితేజ కనిపించడం, ప్రసన్న కుమార్ బెజవాడ పవర్ఫుల్ డైలాగులు .. భీమ్స్ మాస్ బీట్లు .. శ్రీలీల గ్లామర్ .. ఫొటోగ్రఫీ ఈ సినిమా హైలైట్స్ గా నిలిచాయి. చూస్తుంటే సంక్రాంతి బరిలో కూడా ఈ సినిమా నిలిచేలా కనిపిస్తోంది.