పేదలకు సాయం అందించే కార్యక్రమంలో విషాదం కలచివేసింది: చంద్రబాబు
- గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ
- చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట
- ముగ్గురు మహిళల మృతి
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత
పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనతో తాను కార్యక్రమానికి వెళ్లాను అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని... ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.