పేదలకు సాయం అందించే కార్యక్రమంలో విషాదం కలచివేసింది: చంద్రబాబు

  • గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ
  • చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట
  • ముగ్గురు మహిళల మృతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత
గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ చేపట్టిన పేదలకు కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని చెప్పారు. కార్యక్రమం ముగిసిన తరువాత తాను వెళ్లిపోయిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరం అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనతో తాను కార్యక్రమానికి వెళ్లాను అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని... ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.

Chandrababu
Guntur
Stampede
Chandranna Kanuka

More Telugu News