గుంటూరు తొక్కిసలాట ఘటనపై ఎస్పీ వివరణ
- గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ
- హాజరైన చంద్రబాబు
- చంద్రబాబు వెళ్లిన తర్వాత తొక్కిసలాట
- తాము సరిపడినంత బందోబస్తు ఇచ్చామన్న ఎస్పీ
- బారికేడ్ విరగడంతో ప్రమాదం జరిగిందని వివరణ
చంద్రన్న కానుకల పంపిణీపై నిర్వాహకులు గత కొన్నిరోజులుగా ప్రచారం చేయడంతో, ఈ కార్యక్రమానికి భారీగా మహిళలు తరలివచ్చినట్టు తెలుస్తోంది.
ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచే మహిళలు క్యూలైన్లలో ఉన్నారని, అయితే ఓ కౌంటర్ వద్ద బారికేడ్ విరిగిపోవడంతో క్యూలైన్ లో ఉన్న మహిళలు ముందుకుపడిపోగా, వెనుక ఉన్నవారు ఒక్కసారిగా వారిపై పడడంతో ఓ మహిళ ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నలుగురు గాయపడగా, వారిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.