Chiranjeevi: పవన్ ను విమర్శించినవాళ్లతో నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది: చిరంజీవి

Chiranjeevi opines about his brother Pawan Kalyan
  • బాబీ దర్శకత్వంలో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'
  • జనవరి 13న రిలీజ్
  • ప్రమోషన్ కార్యక్రమాలతో చిరంజీవి బిజీ
  • ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పక్కా మాస్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. 

ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ తన సోదరుడు పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని తెలిపారు. పవన్ కు ఇటీవలి వరకు సొంతిల్లు కూడా లేదని వెల్లడించారు. 

ప్రజలకు మేలు చేయాలన్న సత్ససంకల్పంతో రాజకీయ ప్రక్షాళనకు పూనుకున్నాడని, కానీ కొంతమంది పవన్ ను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. 

పవన్ పై విమర్శలు వింటున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుందని, పవన్ ను విమర్శించిన వాళ్లతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుందని తెలిపారు. పవన్ కల్యాణ్ ను ఓ బిడ్డలా భావిస్తానని, తమ కుటుంబంపై అతడికి ఎంతో ప్రేమ అని చిరంజీవి పేర్కొన్నారు.
Chiranjeevi
Pawan Kalyan
Politics
Tollywood

More Telugu News