Bollywood: సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణ్ బీర్ ‘యానిమల్’ ఫస్ట్ లుక్ అదుర్స్

Presenting you the first look of ANIMAL
  • అర్జున్ రెడ్డితో పరిచయం అయిన సందీప్ రెడ్డి వంగా
  • ఆ చిత్రాన్నే ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేసి హిట్
  • ఇప్పుడు ‘యానిమల్’తో ముందుకొస్తున్న వైనం
'అర్జున్ రెడ్డి' లాంటి చిత్రంతో టాలీవుడ్ లో కొత్త ఒరవడి సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తెలుగు సినిమా దృక్ఫథాన్నే మార్చేసింది. విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసింది. ఇదే సినిమాను సందీప్ రెడ్డి.. ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడా హిట్ కొట్టారు. దాంతో సందీప్ తదుపరి చిత్రంపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి ‘యానిమల్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్త ఏడాది కానుకగా ‘యానిమల్’ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ కు తగ్గట్టే పోస్టర్ చాలా వైల్డ్ గా ఉంది. రణ్ బీర్ కపూర్ లుక్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది.

 ఒత్తయిన జట్టు, గుబురు గడ్డం, శరీర మొత్తం రక్తంతో తడిచి, చంకలో గొడ్డలి పెట్టుకుని సిగరెట్ కాల్చుతూ రణ్ బీర్ ఇస్తున్న ఫోజు వైల్డ్ గా కనిపిస్తోంది. అర్జున్ రెడ్డి పోలిక కనిపిస్తున్నప్పటికీ చాక్లెట్ బాయ్ లాంటి రణ్ బీర్ ను ఇలాంటి లుక్ లో పరిచయం చేసిన సందీప్ రెడ్డి అందరూ తన చిత్రం గురించి మాట్లాడేలా చేశారు. ఈ చిత్రంలో రణ్ బీర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.

More Telugu News

Bollywood
sandeep reddy vanga
ranbeer kapoor
Rashmika Mandanna
Vijay Devarakonda