హైదరాబాదులో నుమాయిష్ నేటి నుంచే..!
- ప్రారంభించనున్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ
- హాజరుకానున్న మంత్రులు తలసాని, వేముల
- మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు..
- ప్రవేశ రుసుము పెద్దలకు రూ.40.. ఐదేళ్లలోపు పిల్లలకు ఉచితం
నుమాయిష్ లో ఈసారి మొత్తం 2,400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు అశ్విని చెప్పారు. సందర్శకుల కోసం ఉచిత పార్కింగ్ తో పాటు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రవేశ రుసుమును పెద్దలకు రూ.40 గా నిర్ణయించామని, ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు. నుమాయిష్ లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాళ్లు ఉన్నాయని, పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్ మెంట్ పార్క్ ను రెడీ చేశామని వివరించారు.
ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ప్రదర్శన జరుగుతుందని అశ్విని తెలిపారు. కరోనా భయం పెద్దగా లేకపోవడంతో ఈసారి నుమాయిష్ కు భారీ సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.