Whatsap: భారత పటాన్ని తప్పుగా చూపెడుతూ వాట్సాప్ న్యూ ఇయర్ వీడియో.. హెచ్చరించిన కేంద్రమంత్రి

IT Minister pulls up WhatsApp for incorrect India map in tweet platform deletes post

  • నూతన సంవత్సరం సందర్భంగా వీడియో రూపొందించిన వాట్సాప్
  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు చైనా తనదిగా చెబుతున్న భూభాగాలను మ్యాప్ నుంచి మినహాయించిన వాట్సాప్
  • క్షమించమన్న వాట్సాప్.. వీడియో తొలగింపు

భారత చిత్ర పటాన్ని తప్పుగా చూపించిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’పై కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో ఉండి వ్యాపారం చేసుకుంటూ ఇదేం పని అని మండిపడ్డారు. తప్పుగా చూపించిన మ్యాప్‌ను వెంటనే సరిచేయాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా వాట్సాప్ ఓ వీడియోను రూపొందించి ట్వీట్ చేసింది. ఆ వీడియోలో వాట్సాప్ చూపించిన గ్లోబ్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు చైనా తనదిగా చెబుతున్న కొన్ని భూభాగాలను వాట్సాప్ భారత్ నుంచి మినహాయించింది. నెటిజన్లు ఈ వీడియోపై మండిపడ్డారు. వాట్సాప్‌పై విమర్శలు గుప్పించారు. స్పందించిన కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. వెంటనే తప్పును సరిదిద్దాలని వాట్సాప్‌ను కోరారు. భారత్‌లో వ్యాపారాలు చేసే, కొనసాగాలనుకునే అన్ని ప్లాట్‌ఫాంలు తప్పనిసరిగా సరైన భారత పటాలను ఉపయోగించాలని సూచించారు. 

వీడియో వివాదాస్పదం కావడంతో స్పందించిన వాట్సాప్ దానిని ట్విట్టర్ నుంచి తొలగించింది. అనుకోకుండా ఈ ఘటన జరిగిందని, లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు అని పేర్కొంది. ఆ పోస్టును తొలగించామని, క్షమించాలని వేడుకుంది. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని మంత్రికి వివరణ ఇచ్చింది.

Whatsap
Twitter
Rajeev Chandrasekhar
India Map
  • Loading...

More Telugu News