TSPSC: నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ

TSPSC issues job notifications
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసింది. నూతన సంవత్సరం ముగింట నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 

ఈ నోటిఫికేషన్ల ప్రకారం... డిగ్రీ కళాశాలలకు సంబంధించి 544 పోస్టులు, మున్సిపల్ శాఖలో 78 పోస్టులు... ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 71 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 

డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే, లేదా జూన్ లో పరీక్ష ఉంటుంది. 

మున్సిపల్ శాఖలో ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 

ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టీఎస్ పీఎస్ సీ వెబ్ సైట్ (tspsc.gov.in) ను సందర్శించవచ్చు.
Go Back to Shorts
TSPSC
Notifications
Jobs
Telangana

More Telugu News