బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పవన్ కల్యాణ్ సెల్ఫీ... ఫొటో ఇదిగో!
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి
- బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస
- వివిధ రంగాల వారితో సమావేశం
- హాజరైన పవన్ కల్యాణ్, గద్వాల్ విజయలక్ష్మి
ఈ కార్యక్రమానికి వచ్చిన హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పవన్ ను కలిశారు. ఆయనతో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ లో పంచుకున్నారు.
కాగా, హైదరాబాదులో రాష్ట్రపతి శీతాకాల విడిది నేటితో ముగిసింది. ఈ మధ్యాహ్నం హకీంపేట వైమానిక స్థావరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు.