cbi case: ఏపీ, తెలంగాణ నుంచి ఆరుగురు నకిలీ వైద్యులు.. సీబీఐ దర్యాప్తు

 six fake doctors from Telangana and Andhra Pradesh cbi files case
  • ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాకుండానే సేవలు
  • గల్ఫ్ దేశాలు, కేరళ తదితర ప్రాంతాల్లో ప్రాక్టీస్
  • నకిలీ ధ్రువ పత్రాలతో మోసపూరిత వ్యవహారం
సీబీఐ దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు నకిలీ వైద్యుల గుట్టు బయటకు వచ్చింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్ల వద్ద నకిలీ ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పత్రాలతో నమోదు చేసుకున్న కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సోదాలు కూడా చేపట్టింది.

2011-2022 మధ్య ఉక్రెయిన్, చైనా, నేపాల్ దేశాల్లో వైద్య విద్యను చదివిన 73 మంది సీబీఐ నిఘాలో ఉన్నారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన ఆరుగురు నకిలీ వైద్యులు.. గల్ఫ్ దేశాల్లో, కేరళ, ఇతర ప్రాంతాల్లో వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు గుర్తించారు. వీరిపై సీబీఐ క్రిమినల్ కేసులను నమోదు చేసింది. 

కాజీపేటకు చెందిన గుడిమళ్ల రాకేశ్ కుమార్, చేవెళ్లకు చెందిన శ్రీనివాసరావు, వరంగల్ కు చెందిన మహమ్మద్ ఫసీయుద్దీన్, లింగంపల్లికి చెందిన బి హరికృష్ణా రెడ్డి, విజయవాడకు చెందిన మారుపిళ్ల శరత్ బాబు, విశాఖపట్నంకు చెందిన గొర్ల వెంకట రాజ వంశీపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వీరంతా ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష ఉత్తీర్ణులు కాకుండానే సేవలు అందిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ గుప్తా వెల్లడించారు.
cbi case
fake doctors
Telangana
Andhra Pradesh

More Telugu News