యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి
- స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ అధికారులు
- రాష్ట్రపతి వెంట ఉన్న గవర్నర్ తమిళిసై
దర్శనానంతరం ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. యాదాద్రి పర్యటన సందర్భంగా రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై కూడా ఉన్నారు. మరోవైపు దర్శనానంతరం యాదాద్రి పరిసరాలను రాష్ట్రపతి పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా తిలకించారు. యాదాద్రిని సందర్శించిన ఐదో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు.