మోదీకి సానుభూతిని తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు

  • ఈ తెల్లవారుజామున మృతి చెందిన హీరాబెన్
  • గాంధీనగర్ లో ముగిసిన అంత్యక్రియలు
  • తల్లి చితికి నిప్పంటించిన మోదీ
ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపాన్ని తెలిపారు. ప్రధాని మోదీకి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాతృమూర్తిని కోల్పోయిన ప్రధాని మోదీగారికి హృదయపూర్వకంగా సంతాపాన్ని తెలియజేస్తున్నానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. మోదీకి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

హీరాబెన్ మోదీ ఈ తెల్లవారుజామున 3.40 గంటలకు అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో కన్నుమూశారు. వందేళ్ల పాటు ఆమె సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. ఆరోగ్యం విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. గాంధీనగర్ లో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన తల్లి పాడిని మోసిన మోదీ, ఆమె చితికి నిప్పంటించారు.

Narendra Modi
BJP
Mother
KCR
KTR
Harish Rao
BRS
TRS

More Telugu News