తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు సమర్పించిన కేవీఆర్ జ్యుయెలర్స్ అధినేత
- కానుకల బరువు 1,756 గ్రాములు
- విలువ రూ.1.30 కోట్లు
- వైవీ సుబ్బారెడ్డికి అందించిన కేఆర్ నారాయణమూర్తి
మూల విరాట్ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి విలువైన రాళ్లు పొదిగిన పతకాలు, మలయప్పస్వామికి బంగారు యజ్ఞోపవీతాన్ని విరాళంగా ఇచ్చారు. మేలిమి బంగారంతో తయారుచేసిన ఈ ఆభరణాల బరువు 1,756 గ్రాములు. వీటి విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని కేఆర్ నారాయణమూర్తి వెల్లడించారు.
కేవీఆర్ జ్యుయెలర్స్ అధినేత గతేడాది స్వామివారికి రూ.3 కోట్ల విలువైన బంగారు కటి, వరద హస్తాలను విరాళంగా ఇచ్చారు.