పదవీ విరమణ చేస్తున్న మహేందర్ రెడ్డి... ఇన్చార్జి డీజీపీగా అంజనీకుమార్
- ఈ నెల 31తో ముగియనున్న డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం
- పలువురు ఐపీఎస్ లకు పదోన్నతి
- ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్
ఇక, సీఐడీ అదనపు డీజీగా మహేశ్ భగవత్ ను నియమించారు. మహేశ్ భగవత్ ఇప్పటిదాకా రాచకొండ పోలీస్ కమిషనర్ గా కొనసాగుతున్నారు. ఆయన పదోన్నతిపై వెళుతుండడంతో రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్ ను నియమించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.