కర్ణాటక జైళ్లలో ఖైదీల వేతనాలు 3 రెట్లు పెరిగాయి
- ఖైదీల వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం
- రాష్ట్రవ్యాప్తంగా 54 జైళ్లలో 3,565 మంది ఖైదీలు
- ఏటా వేతనాల రూపంలో ఖైదీలకు చెల్లిస్తున్న మొత్తం రూ.58 కోట్లకు పైనే
వివిధ నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలు వాళ్లు చేసే పనులకు రోజుకు రూ.524 అందుకుంటారు. రెండో ఏడాది రోజుకు రూ.548 చొప్పున నెలకు (వారానికి ఒక సెలవు మినహాయించి) రూ.14,248 చొప్పున ఖైదీలకు అధికారులు చెల్లిస్తారు. మూడో ఏడాది రోజుకు రూ.615 చొప్పున నెలకు రూ.15,990, నాలుగో ఏడాది నుంచి రోజుకు రూ.663 చొప్పున నెలకు రూ.17,238 చెల్లిస్తారు.
కాగా, ఖైదీల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఉచిత భోజనం, వసతితో పాటు నెలనెలా వేతనం అందుకోవడం బాగుంటుందని, ఖైదీల పనే బాగుందని కామెంట్లు పెడుతున్నారు.