జగన్ ను నమ్ముకున్న నా వెంట ఉంటారో లేక చంద్రబాబుకు ఊడిగం చేసే పవన్ వెంట ఉంటారో తేల్చుకోండి: అంబటి రాంబాబు
- వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వనని పవన్ అంటున్నారన్న అంబటి
- పవన్ అంత మగాడా అంటూ ఎద్దేవా
- కాపులను చంద్రబాబు దొడ్లో కట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
విపక్షాలను తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని... అందుకే పవన్ తనను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. కాపు సామాజికవర్గాన్ని చంద్రబాబు దొడ్లో కట్టేసేందుకు పవన్ యత్నిస్తున్నారని అన్నారు. తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా... తనపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.