YS Vijayamma: టీటీడీ ఈవో ధర్మారెడ్డి దంపతులకు వైఎస్ విజయమ్మ పరామర్శ

YS Vijayamma pays tributes to TTD EO Dharma Reddy son Chandramouli
  • ఇటీవలే మృతి చెందిన ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి
  • వచ్చే నెల వివాహం జరగాల్సి ఉండగా ఆకస్మిక మరణం
  • చంద్రమౌళి ఫొటోకు నివాళి అర్పించిన విజయమ్మ
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ధర్మారెడ్డి దంపతులను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాలకు వెళ్లిన విజయమ్మ చంద్రమౌళి చిత్రపటం వద్ద పూలు వేసిన నివాళి అర్పించారు. 

అనంతరం ధర్మారెడ్డి దంపతులను ఓదార్చారు. అధైర్యపడొద్దని, తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. చంద్రమౌళికి టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి కుమార్తెతో వచ్చే నెల వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలను పంచుతున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఇంతకు ముందే ఆయనకు నివాళి అర్పించి, ధర్మారెడ్డి దంపతులను పరామర్శించారు.
YS Vijayamma
Dharma Reddy
TTD EO

More Telugu News