Adi Saikumar: రియా సుమన్ కి ఈ సారైనా హిట్ పడేనా?

  • 2016లోనే ఎంట్రీ ఇచ్చిన రియా సుమన్
  • నాని జోడీగా చేసిన 'మజ్ను' ఆమె ఫస్టు మూవీ 
  • రెండో సినిమాగా నిరాశపరిచిన 'పేపర్ బాయ్'
  • ఇక ఆశలన్నీ ఈ సినిమాపైనే 
  • ఈ నెల 30న విడుదలవుతున్న సినిమా   
Riya Suman Special

రియా సుమన్ .. ఈ పేరు వినగానే ఎక్కడో విన్నట్టుగా ఉందని అనిపిస్తుంది. నిజంగానే ఈ బ్యూటీ 2016లోనే టాలీవుడ్ కి పరిచయమైంది. నాని హీరోగా చేసిన 'మజ్ను' సినిమాలో ఈ సుందరి సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన, రియా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయినా ఆమెను వెతుక్కుంటూ రెండో అవకాశం వెళ్లింది. 

అలా ఆమె చేసిన రెండో సినిమానే 'పేపర్ బాయ్'. ఈ సినిమాలోని ఇద్దరు హీరోయిన్స్ లో రియా ఒకరు. సంతోష్ శోభన్ జోడీగా రియా చేసిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందువలన సహజంగానే ఈ బ్యూటీకి గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇప్పుడు 'టాప్ గేర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

ఆది సాయికుమార్ హీరోగా చేసిన ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ ..రొమాన్స్ ను టచ్ చేస్తూ సాగే యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమాతోనైనా రియాకి హిట్ పడుతుందేమో చూడాలి. ఇక కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆది సాయికుమార్ కి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం..

More Telugu News