నెల్లూరులో నేటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదిగో
- ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న చంద్రబాబు
- 4 నుంచి 5.15 వరకు కందుకూరులో రోడ్ షో
- ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ
- రాత్రికి అక్కడే బస
ఈ ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరు నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 4 గంటలకు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని దివి కొండయ్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తారు. 4 గంటల నుంచి 5.15 వరకు వెంకటనారాయణ నగర్, అంబేద్కర్ విగ్రహం, పోస్టాఫీస్ సెంటర్ మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.
