Perni Nani: బాలకృష్ణ టాక్ షోకి పవన్ కల్యాణ్ రావడంపై... పేర్ని నాని స్పందన

Perni Nani opines on Balakrishna Unstoppable Talk Show with Pawan Kalyan
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2
  • పవన్ కల్యాణ్ తో ఎపిసోడ్ చిత్రీకరణ
  • బావతో తిరిగే పవన్ ఇప్పుడు బావమరిదితో తిరుగుతారన్న నాని
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకి జనసేనాని పవన్ కల్యాణ్ విచ్చేస్తుండడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన చిత్రీకరణ కూడా ఇటీవలే నిర్వహించారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రోమో రానుంది. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. 

బావ (చంద్రబాబు)తో తిరిగే పవన్ ఇప్పుడు బావమరిది (బాలకృష్ణ)తో తిరుగుతారు.... అందులో తప్పేముంది? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడు బావ (చంద్రబాబు) కోసం పనిచేసేందుకు బాలకృష్ణకు మరో అవకాశం వచ్చిందని తెలిపారు. చంద్రబాబుకు అనుకూల పార్టీలను ఈ కార్యక్రమం ద్వారా పోగేసుకునే అవకాశం వచ్చిందని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ తెలివైన వ్యక్తి అని ఈ షో ద్వారా వెల్లడైందని పేర్కొన్నారు. 

తన బావ (చంద్రబాబు)తో తిరిగే వ్యక్తితో బాలయ్య టాక్ షో చేయడంలో ఆశ్చర్యమేముందని పేర్ని నాని పేర్కొన్నారు. తన బావ (చంద్రబాబు) చేసే తప్పులను సరిచేయడానికి, ఆయన భాగస్వాములను కూర్చోబెట్టి మాట్లాడ్డానికి ఈ టాక్ షోని ఓ వేదికగా మలుచుకున్నారా? అంటూ సందేహం వెలిబుచ్చారు.
Perni Nani
Balakrishna
Pawan Kalyan
Unstoppable-2
Chandrababu
TDP
Janasena

More Telugu News