వైసీపీలో చేరి తప్పు చేశాను, క్షమించాలంటూ పరిటాల సునీత కాళ్లపై పడిన కార్యకర్త

YSRCP Worker fell down on paritala sunitha feet
  • రాప్తాడు మండలం మరూరులో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం
  • సునీత కాళ్లపై పడిన ముచ్చుమర్రికి చెందిన కార్యకర్త
  • పార్టీ కండువా కప్పి తిరిగి పార్టీలో చేర్చుకున్న సునీత
తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని, తనను క్షమించాలని వేడుకుంటూ ఓ కార్యకర్త మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి వేడుకున్నాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో జరిగిందీ ఘటన. 

నిన్న ఇక్కడ నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రామాంజనేయులు సునీత కాళ్లపై పడి తనను క్షమించాలని వేడుకున్నాడు. వైసీపీలో చేరి తప్పుచేశానని, తనను మళ్లీ టీడీపీలో చేర్చుకోవాలని ప్రాధేయపడ్డాడు. రామాంజనేయులను పైకి లేపిన సునీత.. మీలాంటి వారికి పార్టీలో ఎప్పటికీ స్థానం ఉంటుందంటూ కండువా కప్పి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు.
Go Back to Shorts
Anantapur District
Raptadu
Paritala Sunitha
TDP
Idem Karma Rashtraniki

More Telugu News