రేపు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం... వైసీపీ మినహా అన్ని పార్టీలకు ఆహ్వానం
- అచ్చెన్నాయుడు అధ్యక్షతన అఖిలపక్షం
- సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన బొండా ఉమ తదితరులు
- వైసీపీ అరాచకాలపై ఫొటో ప్రదర్శన ఉంటుందన్న ఉమ
ఈ సమావేశ ఏర్పాట్లను బొండా ఉమ, అశోక్ బాబు, టీడీ జనార్దన్ పరిశీలించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ, వైసీపీ అరాచకాలపై ఫొటో ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వైసీపీ అరాచకాలపై న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు.