Raavi venkateswar rao: పెట్రోల్ బాంబు విసిరింది కొడాలి నాని అనుచరులే: రావి వెంకటేశ్వరరావు

Raavi Venkateswar Rao fires on Kodali Nani
  • రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత
  • కొడాలి నాని రూ. 5 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న రావి
  • పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడివాడలోని ఏజీకే స్కూల్ దగ్గర రంగా విగ్రహానికి టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు, టీడీపీ శ్రేణులతో పాటు జనసేన కార్యర్తలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కొడాలి నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొడాలి నాని రూ. 5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

వంగవీటి మోహన రంగా స్ఫూర్తితో గుడివాడలో రౌడీయిజాన్ని అంతమొందిస్తామని చెప్పారు. నిన్న రాత్రి గుడివాడలో పెట్రోల్ బాంబు విసిరింది కొడాలి నాని అనుచరులేనని అన్నారు. ఇంకోసారి టీడీపీ జనాల జోలికి వస్తే కొడాలి నాని నాలుక కోసేస్తామని హెచ్చరించారు. గుడివాడలో దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Raavi venkateswar rao
tdp
Kodali Nani
YSRCP

More Telugu News