Chandrababu: చంద్రబాబు ఫ్లెక్సీల ఏర్పాటును అడ్డుకున్న కావలి మున్సిపల్ కమిషనర్

Kavali municipal commissioner removed Chandrabau flexes
  • కావలిలో పర్యటించబోతున్న చంద్రబాబు
  • ఫ్లెక్సీలను తొలగిస్తున్న మునిసిపల్ కమిషనర్ శివారెడ్డి
  • గతంలో కూడా వివాదంలో చిక్కుకున్న శివారెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లలో భాగంగా పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, ఈ ఏర్పాట్లను మునిసిపల్ కమిషనర్ శివారెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీరు శివారెడ్డి కమిషనర్ ఇంటిని ముట్టడించారు. వైసీపీ ఫ్లెక్సీలను తొలగించకుండా... టీడీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం ఏమిటని మండిపడ్డారు. గతంలో కూడా మునిసిపల్ కమిషనర్ శివారెడ్డి ఫ్లెక్సీల వివాదంలో చిక్కుకున్న విషయం గమనార్హం.
Chandrababu
Telugudesam
Kavali

More Telugu News