చలపతిరావు జీవితంలో విషాదం.. అగ్నిప్రమాదంలో చనిపోయిన భార్య
- ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భార్య ఇందుమతి మృతి
- నీళ్లు పట్టుకునేందుకు వెళ్లినప్పుడు చీరకు నిప్పంటుకున్న వైనం
- మూడు రోజులు మృత్యువుతో పోరాడి మృతి
కొడుకు, ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత ఆయన భార్య ఇందుమతి అగ్ని ప్రమాదంలో చనిపోయారు. చెన్నైలో ఉన్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారుజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లినప్పుడు ఆమె చీరకు నిప్పంటుకుంది. ఆమె అరుపులు విన్న చలపతిరావు మంటలార్పారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆమె మృతి చెందారు. ఆ తర్వాత చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదు. తన ముగ్గురు పిల్లలకే జీవితం మొత్తాన్ని కేటాయించారు.