Chandrababu: రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరం: చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu and  Pawan Kalyan pays condolences to Chalapathi Rao
  • ఈ తెల్లవారుజామున కన్నుమూసిన చలపతిరావు
  • రెండు రోజుల క్రితం కైకాల సత్యనారాయణ కన్నుమూత
  • వరుస మరణాలతో షాక్ లో టాలీవుడ్
సీనియర్ సినీ నటుడు చలపతిరావు ఈ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. చలపతిరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. 

పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ప్రముఖ నటులు చలపతిరావు కన్నుమూయడం బాధాకరమని చెప్పారు. ప్రతి నాయకుడి పాత్రల్లోనే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన శైలిలో సినీ అభిమానులను మెప్పించారని తెలిపారు. నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించారని కొనియాడారు. ఒక తరానికి సినీ పరిశ్రమ ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేస్తుండటం దురదృష్టకరమని చెప్పారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News