కైకాల అంతిమయాత్ర ప్రారంభం
- ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసం నుంచి బయలుదేరిన రథం
- మరికాసేపట్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు
- అధికారిక లాంఛనాలతో నిర్వహణ
కైకాల పార్థివ దేహాన్ని తీసుకెళుతున్న పూలరథం వెంబడి ఆయన అభిమానులు వాహనాలతో అనుసరిస్తున్నారు. ఇప్పటికే మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కైకాల.. శుక్రవారం మరణించారని తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నటులు చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు రాజకీయ నేతలు కైకాల పార్థివదేహానికి శుక్రవారం నివాళులు అర్పించారు.