Mahesh Babu: కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన మహేశ్ బాబు

Mahesh Babu Namrata Shirodkar and kids jet off for Christmas New Year holiday spotted at airport
  • హైదరాబాద్ విమానాశ్రయంలో దర్శనం
  • బ్లూ హుడీ, బ్లూ రంగు క్యాప్ తో మహేశ్ బాబు
  • నూతన సంవత్సరం వేడుకల తర్వాత స్వదేశానికి తిరుగు ప్రయాణం
టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు, తన కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ దర్శనమివ్వడం గమనార్హం. వీరు ఎక్కడకు వెళ్లారన్న విషయం వెల్లడి కాలేదు. క్రిస్ మస్, నూతన సంవత్సరం వేడుకల తర్వాత వీరు జనవరి మొదటి వారంలో తిరిగి రానున్నారు. 

మహేశ్ బాబు ప్రతి కొత్త సినిమా ఆరంభానికి ముందు విదేశీ పర్యటనకు వెళ్లడం ఆయనకు అలవాటుగా ఉంటోంది. ఈ ట్రిప్ ముగించుకుని వచ్చిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి కొత్త ప్రాజెక్ట్ లో మహేశ్ బాబు పనిచేయనున్నారు. మహేశ్ బ్లూ హుడీ, బ్లూ రంగు క్యాప్ ధరించి ఎయిర్ పోర్ట్ లో కనిపించగా, నమ్రత పసుపు రంగు హుడీలో, నల్ల కళ్లద్దాలతో దర్శనం ఇచ్చింది. వీరి వెంట పిల్లలు కూడా ఉన్నారు. 

ఇక మహేశ్ బాబు త్రివిక్రమ్ సారథ్యంలో మూడో సినిమాకు పని చేయబోతున్నారు. ఇందులో మహేశ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. మహేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా అతడు సూపర్ సక్సెస్ కాగా, ఖలేజా అంత స్పందన అందుకోలేకపోయింది.
Mahesh Babu
Namrata Shirodkar
family trip
holidays
foreign trip

More Telugu News