రంగంలోకి దిగుతున్న షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్
- ది అర్చీస్ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సుహానా ఖాన్
- ఇదే చిత్రంలో అమితాబ్ మనవడు అగస్త్య, శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ తెరంగేట్రం
- వచ్చే ఏడాది నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న చిత్రం
ఈ సినిమాకు జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. టైగర్ బేబీ ప్రొడక్షన్స్ తో కలసి నెట్ ఫ్లిక్స్ దీనిని నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. థియేటర్లలో కాకుండా వచ్చే ఏడాది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మొన్నటిదాకా సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడిపిన సుహానా ఖాన్ ఇప్పుడు కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతోంది. తండ్రి షారూక్ తనకు ఇచ్చిన బహుమతిగా ఇచ్చిన ఓ జర్నల్ చదువుతోంది. షారూఖ్ కొన్నేళ్లుగా నటనకు సంబంధించిన మెలకువలను ఈ జర్నల్‌లో రాసుకున్నారు. నటనకు సంబంధించిన ప్రతి విషయం తనకు తెలియదని, కొన్నింటిని ఇక్కడ రాశానని షారూక్ చెప్పారు. 'ఈ కొన్ని విషయాలను నువ్వు నేర్చుకుని నాకు నేర్పించాలి' అంటూ జర్నల్ ను కూతురుకు ఇచ్చిన సందర్భంగా షారూక్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.