కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించిన జగన్, మహేశ్ బాబు
- సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలియజేసిన జగన్
- ఆయనతో మధుర జ్ఞాపకాలు ఉన్నాయన్న మహేశ్
- సత్యనారాయణగారి మృతి తీరని లోటు అని వ్యాఖ్య
టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణగారి మృతి కలచివేస్తోందని మహేశ్ అన్నారు. ఆయనతో కలిసి నటించినప్పటి ఎన్నో మధుర జ్ఞాపకాలు తనకు ఉన్నాయని చెప్పారు. ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. సత్యనారాయణగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.