RRR: ఆస్కార్ లో 'ఆర్ఆర్ఆర్' పరిస్థితి ఎలా ఉందంటే...!

  • త్వరలో ఆస్కార్ అవార్డుల ఉత్సవం
  • కొనసాగుతున్న నామినేషన్ల వడపోతలు
  • ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ కు చాన్స్
  • ఇంకా ప్రకటించాల్సి ఉన్న పలు కేటగిరీలు
RRR in fray of Oscars

భారత సినీ వైభవాన్ని అంతర్జాతీయస్థాయిలో చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పుడీ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అవడం ద్వారా విశిష్ట గౌరవం దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాట తుది జాబితాలో చోటు దక్కించుకుంది. 

ఆస్కార్ అవార్డుల కోసం ఇప్పటిదాకా 10 కేటగిరీల్లో నామినేషన్లు ప్రకటించారు. ఇంటర్నేషనల్ ఫీచర్, ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫీచర్, డాక్యుమెంటరీ షార్ట్, సౌండ్, ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్, లైవ్ యాక్షన్ షార్ట్, మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, విజువల్ ఎఫెక్ట్స్ లో మాత్రమే తుది జాబితాలు ఖరారయ్యాయి. 

అయితే ఒరిజినల్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీల్లో కూడా ఆర్ఆర్ఆర్ నామినేట్ అవుతుందని చిత్రబృందం భావించినా, నిరాశ తప్పలేదు. ఈ రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు స్థానం లభించలేదు. ఇక మిగిలింది 13 కేటగిరీలు! బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్/అడాప్టెడ్), బెస్ట్ స్టోరీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్/యాక్ట్రెస్ తో పాటు ఇంకా కొన్ని కేటగిరిల్లో ఫైనల్ నామినేషన్లు ప్రకటించాల్సి ఉంది. 

సౌండ్ డిజైన్/మిక్సింగ్ కేటగిరీలో అవకాశం కోల్పోయిన ఆర్ఆర్ఆర్ మిగిలిన కేటగిరీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

More Telugu News