Nara Brahmani: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నారా బ్రాహ్మణి జన్మదిన వేడుకలు

Nara Brahmani birthday celebrations held at TDP head office
  • నేడు నారా బ్రాహ్మణి పుట్టినరోజు
  • కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు
  • హాజరైన ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు 
  • బ్రాహ్మణి మహిళా వ్యాపారవేత్తలకు రోల్ మోడల్ అన్న టీడీపీ నేతలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు (డిసెంబరు 21) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా బ్రాహ్మణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతలు కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ , మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర బాబు, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, టీఎన్ టీయూసీ అధ్యక్షుడు గొట్టిముక్కల రఘు, ఎన్ ఆర్ ఐ కోఆర్డినేటర్ రాజశేఖర్, క్రిష్టియన్ సెల్ అధ్యక్షుడు స్వామిదాస్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా టీడీపీ  నేతలు మాట్లాడుతూ... యువ మహిళా వ్యాపారవేత్తలకు బ్రాహ్మణి రోల్ మోడల్ గా నిలుస్తున్నారని కొనియాడారు. ఆమె వ్యాపారంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని నేతలు అన్నారు.
Nara Brahmani
Birthday
Celebrations
Head Office
TDP

More Telugu News