Samantha Ruth Prabhu: సమంత లాంగ్ బ్రేక్.. ఇప్పట్లో నటించడం కష్టమేనట!

Samantha Ruth Prabhu Walks Out of Bollywood Films Due to Health Issue Actor Going on Long Break
షార్ట్స్‌లో చూడండి
మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడిన ప్రముఖ నటి సమంత రుతు ప్రభు.. ఇప్పట్లో నటించడం కష్టమేనని తెలుస్తోంది. తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్టు సమంత స్వయంగా ఇటీవలే ప్రకటించింది. చికిత్స తీసుకుంటున్న ఫొటోను కూడా సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. దీంతో త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు స్పందన వ్యక్తం చేశారు. 

సమంత చివరిగా యశోద చిత్రంలో నటించింది. మయోసైటిస్ కారణంగా సినిమా ప్రచారంలో ఆమె పాల్గొనలేదు. ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు నటనకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం. హిందీలో ద ఫ్యామిలీ సీజన్ 2 కార్యక్రమం విజయం సాధించడంతో, పలు బాలీవుడ్ సినిమాలను సమంత అంగీకరించింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. తాను కొంత లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు చిత్ర నిర్మాతలకు సమంత చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వారు ఇతర ఆప్షన్లను పరిశీలించే పనిలో పడ్డారు. 

విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా పూర్తయిన తర్వాత కొంచెం లాంగ్ బ్రేక్ తీసుకోవాలనే సమంత భావిస్తున్నట్టు సమాచారం. ఖుషీ సినిమా షూట్ 60 శాతం పూర్తయినట్టు విజయ్ దేవరకొండ ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. వాస్తవానికి ఈ డిసెంబర్ కే సినిమా పూర్తవుతుందని భావించామని, ఎన్నో కారణాలతో దీన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకున్నట్టు, 2023 ఫిబ్రవరిలో విడుదల కావచ్చని విజయ్ వెల్లడించడం గమనార్హం.
Go Back to Shorts
Samantha Ruth Prabhu
Long Break
ACTING
khushi

More Telugu News