Jayasudha: జయసుధ .. జయప్రదలతో 'అన్ స్టాపబుల్ 2'

  • 'అన్ స్టాపబుల్ 2' వేదికపై అరుదైన కలయిక
  • సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ
  • గ్లామర్ పరంగా ప్రశంసలను అందుకున్న జయప్రద 
  • సుదీర్ఘ ప్రయాణంలో అనేక సక్సెస్ లను అందుకున్న హీరోయిన్స్ 
  •  ఈ ఎపిసోడ్ లో రాశి ఖన్నాకి దక్కిన చోటు
Unstoppable 2 Update

1970 - 80 దశకాలలో తెలుగు తెరపై సందడి చేసిన కథానాయికలలో జయసుధ - జయప్రద ప్రధానంగా కనిపిస్తారు. నటన ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ జయసుధ ముందుకు వెళితే, అందమైన అభినయం ప్రధానంగా జయప్రద రాణించారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు సరసన నాయికలుగా ఈ ఇద్దరు హీరోయిన్స్ అనేక విజయాలను తమ సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ ఇద్దరినీ తెలుగు ప్రేక్షకులు ఒకే వేదికపై చూడనున్నారు .. ఆ వేదిక పేరే 'అన్ స్టాపబుల్ 2'. 'ఆహా' ఫ్లాట్ ఫామ్ ద్వారా అలరిస్తున్న ఈ టాక్ షో లో జయసుధ - జయప్రద సందడి చేయనున్నారు. ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ తో పాటు, ఈ తరం నాయిక రాశిఖన్నా కూడా కనిపించనుంది. ఈ ముగ్గురు నాయికలకి సంబంధించిన ఎపిసోడ్ రీసెంట్ గా షూటింగు పూర్తిచేసుకుంది. వారితో బాలయ్య చేసిన సందడి తాలూకు ఫొటోలు బయటకి వచ్చాయి. త్వరలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ముందుగా అందుకు సంబంధించిన ప్రోమో బయటికి రానుంది. ఈ మధ్య కాలంలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ పాల్గొన్న ఎపిసోడ్ ఇదేనేమో.

More Telugu News